calender_icon.png 29 September, 2024 | 2:53 AM

కాటమయ్య కిట్ల పంపిణీలో ప్రొటోకాల్ రగడ

29-09-2024 12:45:29 AM

కరీంనగర్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): కరీంనగర్ పరిధిలోని రేకుర్తి గౌడ కులస్తులకు ప్రభుత్వం అందిస్తున్న కాటమయ్య కిట్ల పంపిణీలో ప్రొటోకాల్ వివాదం చోటు చేసుకుంది. శనివారం రూరల్ ఆబ్కారీశాఖ సీఐ ఆధ్వర్యంలో కిట్లు పంపిణీ చేసి, తాటి చెట్టు ఎక్కడంపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి గౌడ కులానికే చెందిన స్థానిక కార్పొరేటర్ సుదగోని మాధవిని ఆహ్వానిం చకపోడంతో శిబిరం వద్దకు చేరుకుని సీఐని నిలదీశారు.

కార్పొరేటర్ భర్త గౌడ సంఘం సభ్యుడు సుదగోని కృష్ణగౌడ్ కూడా తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. మంత్రి తాలూకు వారు వద్దన్నారని చెప్పడంతో అక్కడున్న వారు నిలదీయగా సదరు అధికారి సారి చెబు తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.