calender_icon.png 26 January, 2025 | 12:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూములు ఇచ్చే వరకు దీక్షలు ఆపేది లేదు

25-01-2025 12:00:00 AM

చేవెళ్ల, జనవరి 24: శంకర్పల్లి మండల పరిధి కొండకల్, వెలిమెల శివారులోని లంబాడ గిరిజనులు భూ ఆక్రమణలపై వారు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శుక్రవారం14వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పలు రియల్ ఎస్టేట్ కంపెనీల వారు తమకు సంబంధించిన 80 ఎకరాల భూములు అన్నాయంగా తమ వద్ద నుంచి తీసుకు న్నారని, భూములు మాకు ఇచ్చేంతవరకు మా దీక్షలు ఆపమన్నారు. 

ప్రభుత్వం  సహకరించి తమకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే న్యాయం కోసం ఎంత వరకు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నా మని హెచ్చరించారు. పి.లక్ష్మణ్, రవి, శంకర్, బాబు, లక్ష్మణ్, చందర్, రెడ్డి,, గోపి, సోనిబాయి, తులసి, గోమా, మున్న, శంకరమ్మ, మాణెమ్మ, పి.కవిత, కొండకల్ మాజీ వార్డు సభ్యుడు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మర్రివాగు రాజు, తండా వాసులు, తదితరులు పాల్గొన్నారు.