calender_icon.png 28 February, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో రోజు కొనసాగిన నిరసన

28-02-2025 04:33:34 PM

పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని నవభారత్ లో గల ఎన్ఎండిసి ప్లాంట్ గేట్ వద్ద శుక్రవారం కార్మికులు నల్ల బ్యాడ్జీలతో, యూనియన్ జెండాలతో నిరసన తెలిపారు. పే రీసన్ వెంటనే ప్రకటించాలని పాల్వంచ యూనిట్ను పునరుద్ధరించి కార్మికులకు న్యాయం చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ యూనియన్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు సెక్రెటరీ బాలు నాయక్, ఉపాధ్యక్షుడు వీరభద్రం జాయింట్ సెక్రెటరీ అగర్ అత్తయ్య, నాగేశ్వరరావు లక్ష్మణ్, లాలందర్, సుబ్రహ్మణ్యం సిఐటియు నాయకులు ఉమేష్, మహిళా కార్మికులు రుక్య, శీనమ్మ తదితరులు ఉన్నారు.