calender_icon.png 24 October, 2024 | 8:54 AM

విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరించాలి

24-10-2024 02:55:47 AM

ఈఆర్సీకి శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ విజ్ఞప్తి

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గొడ్డలి పెట్టుగా మారే అవకాశం ఉన్న విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరించాలని శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనా చారి ఈఆర్సీకి విజ్ఞప్తి చేశారు. బుధవారం విద్యుత్ నియంత్రణ భవన్‌లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషనర్(ఈఆర్సీ) బహిరంగ విచారణ సందర్భంగా మధుసూదనాచారి హాజరై వాదనలు వినిపించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రజలు కరెంట్ విషయంలో ఎన్నో కష్టాలు పడ్డారని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ దార్శనికతతో విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్ది దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టినట్లు పేర్కొన్నారు.

7 వేల మెగావాట్ల నుంచి 24 వేల మెగావాట్ల సామర్థ్యం వైపు తెలంగాణను తీసుకెళ్లారని, వ్యవసాయానికి ఉచిత, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందించినట్లు తెలిపా రు. విద్యుత్ చార్జీల పెంపు లేకుండానే ప్రభు త్వ సంపదను పెంచేందుకు కేసీఆర్ ప్రభు త్వం కృషి చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం అం దుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

డిస్కంల చేత విద్యుత్ ఛార్జీల పెం పు ప్రతిపాదనలను ఈఆర్సీకి పంపించి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయాలని చూస్తున్నదని మండిపడ్డారు. మధుసూదనాచారితో ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సురభి వాణిదేవి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు ఉన్నారు.