ముషీరాబాద్ (విజయక్రాంతి): ఎన్నికల ముందు ఉద్యమకారులకు, కళాకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారులు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి, ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రపుల్ రాంరెడ్డిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బాగ్‌లింగంపల్లిలో కళాకారుల హక్కుల సాధనకై ఆటా పాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కళాకారులు కీలక భూమిక పోషించారని, వారికి కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు.
ఉద్యమకారులకు 250 గజాల స్థలంతో పాటు సంక్షేమ భోర్డు, పెన్షన్ సౌకర్యం కల్పించాలని అన్నారు. ఉద్యమకారుల హక్కుల సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా కళాకారుల ఆటా పాటా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కోశాధికారి చంద్రశేఖర్, గంటి చంద్రుడు, షేక్ షావలి, మోహన్ బైరాగి, కృష్ణసాగర్, అయ్యవారి యాదగిరి, హన్మంతరావు, ఇంద్ర, గంగి రాజు, వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కళాకారులు, ఉద్యమకారులు పాల్గొన్నారు.