కరీంనగర్, అక్టోబరు 27 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకా రులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల ఫోరం చైర్మన్ కనకం కుమారస్వామి, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ మోతె ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని ప్రెస్ భవన్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని ప్రతి బింబించే విధంగా ఒక్కో ఉద్యమకారునికి 250 గజాల భూమి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి, హామీ ఇచ్చి సంవత్సరం కావొస్తున్న హామీ నెరవేరలేదన్నారు. ప్రభుత్వం వెంటనే ఉద్యమ కారుల ఎంపికకు కమిటీ వేయాలని, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు.
అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఉద్యమకారులకు 10 శాతం తగ్గకుండా సంక్షేమ ఫలాలు అందజేయాలన్నారు. సమావేశంలో ఉద్యమకారులు ఐల ప్రసన్న, చొప్పరి సుధాకర్, కారుపాకల మున్నా, భార్గవి, మాధవి, సాగర్, సుధాకర్, చిన్నా, సాయి, లక్ష్మి, గాలి రమేశ్, కొయ్యడ పద్మ, అంజలి, కనకలక్ష్మి, విలా సాగర్, సంతోశ్, కుడితి శ్రీనివాస్, విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.