జనగామ టౌన్, జూలై 14 (విజయక్రాం తి): కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారుల కు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు నీల రాజు, రిటైర్డ్ కల్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి డిమాండ్ చేశారు. జనగామ ఆర్టీసీ చౌరస్తా లో ఆదివారం ఆయన సంఘం నాయకుల తో కలిసి నిరసనలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. సమస్యలపై ఈ నెల 15 నుంచి 27 వరకు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందిస్తామన్నారు. ముదిరాజ్ వర్గాన్ని బీసీ ‘డి’ నుంచి బీసీ ‘ఏ’లోకి మార్చాలన్నా రు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.