ప్రధానోపాధ్యాయుల డిమాండ్
కామారెడ్డి, డిసెంబర్ 22 (విజయక్రాంతి): సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం 13వ రోజుకు చేరాయి. కామారెడ్డిలో ఆదివారం జిల్లాలోని గెజిటెడ్ ప్రధానో పాధ్యాయులు మద్దతు తెలిపారు. జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు నీలం లింగం మాట్లాడుతూ.. సీఎం వందరోజుల గ్యారెంటీ ఏమైందని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు రాష్ట్రస్థాయిలో గెజిటెడ్ ఉపాధ్యాయుల సంఘం మద్దతు ఉంటుందని తెలిపారు. రానున్న రెండు రోజుల్లో కేజీబీవీకి తాళాలు వేసి డీఈవోకి అందజేస్తామని తెలిపారు. దీక్షలో జిల్లా సమగ్ర శిక్ష జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు సంపత్, రాములు, సంతోస్‌రెడ్డి, శైలజ, కాళిదాసు, వీణ, సాయిలు, లావణ్య, శ్రీను, మాధవి, యోగేష్, బన్సీలాల్, దినేష్,రాజు, రాధిక, లింగం, కృష్ణ, మాధవి తదితరులు పాల్గొన్నారు.