calender_icon.png 9 February, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రొహిబిషన్ కాలాన్ని తగ్గించాలి

08-02-2025 01:03:16 AM

టీఎన్జీవోస్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్

ముషీరాబాద్, ఫిబ్రవరి 7: రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీస్‌ను వారి నియామక తేదీ నుంచి పరిగణిస్తూ ప్రొహిబిషన్ కాలాన్ని నాలుగేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించాలని టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్‌డిమాండ్ చేశారు. శుక్రవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీఎన్జీవోస్ రాష్ట్ర స్థాయి సదస్సు ఫోరం జరిగింది. ఈ సదస్సులో వివిధ జిల్లాల అధ్యక్షులు అజయ్,లక్ష్మణ్, రామకృష్ణారావు,నర్మదారెడ్డి,కళ్యాణి,సదానందం, యాకూబ్ పాషా, వెంకటేశ్, రాజు, శ్రీనివాస్ గౌడ్, కాశీం, విజయ్, రామకృష్ణ పాల్గొన్నారు.