సింగరేణి సీఎండీ బలరామ్
హైదరాబాద్, జూలై ౨ (విజయక్రాంతి): ప్రస్తుత ఆర్థిక సంవత్స రం లో నిర్దేశించుకున్న 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోడానికి వీలుగా ఈ వర్షాకాలంలో నూ ఉత్పత్తికి విఘాతం కలగకుండా రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని, అదే విధంగా రోజుకు 13 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు చేపట్టాలని సింగరేణి సీఎండీ ఎన్ బల రామ్ ఏరియా జీఎంలను ఆదేశించారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ఆయన సంస్థ డైరెక్టర్లు, ఏరియా జీఎంలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాకాలంలో ఉత్పత్తికి నష్టం వాటిల్లకుండా హాల్ రోడ్లను ఎప్పటికప్పు డు పటిష్టపరచుకోవాలని, క్వారీల్లో నిలిచిన వర్షపు నీటిని పంపింగ్ చేయాలని, ఏదైనా షిఫ్టులో వర్షం వల్ల ఉత్పత్తికి నష్టం కలిగితే మరుసటి షిఫ్ట్‌లో భర్తీ చేయాలని సూచిం చారు.
ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోడానికి అన్ని ఏరియాలకు అవసరమైన యంత్రాలను, ఓవర్ బర్డెన్ తొలగించడానికి ఏజెన్సీల నియామకం వంటివి పూర్తి చేశామని, ఏరియా యాజమాన్యాలు మరింత శ్రద్ధ వహిస్తూ లక్ష్యాల మేర బొగ్గు ఉత్పత్తి చేపట్టాలన్నారు. సంస్థ రానున్న ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల లక్ష్యా న్ని చేరుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. మూడు నెల ల్లో ఒడిశా రాష్ర్టంలోని నైనీ బొగ్గు బ్లాక్ నుంచి ఉత్పత్తి ప్రారంభం అవుతుందని దీమా వ్యక్తంచేశారు. సమా వేశంలో సంస్థ డైరెక్టర్ (ఈఅండ్‌ఎం) డీ సత్యనారాయణరావు, డైరెక్టర్ (ఆపరేషన్స్, పర్సనల్) ఎన్‌వీకే శ్రీని వాస్, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజె క్ట్స్) జీ వెంకటేశ్వర్‌రెడ్డి, జీఎం (కోఆర్డినేషన్) జీ దేవేందర్, జీఎం (సీపీ పీ) రవికుమార్ పాల్గొన్నారు.