‘తంగలాన్’ చిత్రబృందం సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో సమావేశమైంది. హీరో విక్రమ్‌తో పాటు మిగతా చిత్రబృందం విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆ విశేషాలివీ.. “ఇది తెలుగు, తమిళ, కన్నడ అని కాదు.. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ రిలేట్ అయ్యే స్టోరీ. ఈ కథలో స్వేచ్ఛ కోసం చేసే పోరాటం ఉంది. ఇది ఒక వర్గానికి ఆపాదించలేం. సినిమాలో నా క్యారెక్టర్ లుక్స్ చూసినపుడు ఒక్కోసారి ఒక్కో అంచనాలు ఏర్పడ్డాయి.
ఫస్ట్ టైమ్ లుక్ రిలీజ్ చేసినప్పుడు కేజీఎఫ్‌లా ఉంటుందా? అనీ, తెగ నాయకుడి గెటప్ రిలీజ్ చేసినపుడు రా అండ్ రస్టిక్ అని భావిచాంరు. కానీ ‘తంగలాన్’లో అన్ని అంశాలూ ఉన్నాయి. క్యారెక్టర్ కోసం మేకోవర్ అయ్యేందుకు కొన్ని గంటల సమయం పట్టేది. మళ్లీ మేకప్ తొలగించుకునేందుకు కనీసం రెండు గంటలు అయ్యేది. చలిలో, వేడిలో అలాగే షూటింగ్ చేశాం. ఇష్టమైన పని దొరికినపుడు ఆకలి, నిద్ర మర్చిపోతుంటాం. నటిస్తున్నప్పుడు మిగతా విషయాలేవీ పట్టించుకోను. అవార్డుల కన్నా ప్రేక్షకుల ప్రశంసలే సంతోషాన్ని ఇస్తాయి. ఆఫ్రికన్ ట్రైబ్స్ సహా ప్రపంచంలోని కొన్ని తెగల గురించి తెలుసుకున్నా’ అని హీరో విక్రమ్ తెలిపారు.