calender_icon.png 20 January, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూములను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలి

20-01-2025 01:06:22 AM

* కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, జనవరి 19 ( విజయక్రాంతి ) :   వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగిన రైతులకు రైతు భరోసా లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని,  వ్యవసాయ యోగ్యం కానీ భూములను గుర్తించే ప్రక్రియ వేగవం తం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమా ల అమలు కోసం అర్హుల ఎంపిక కోసం జరుగుతున్న సర్వే విషయమై ఆదివారం కొత్తకోట మున్సిపాలిటీ కార్యాలయంలో కలెక్టర్ మండల స్థాయి  అధికారులతో స మావేశం నిర్వహించారు.

అనంతరం కొత్త కోట మున్సిపాలిటీ పరిధిలోని దండుగడ్డ ప్రాంతంలో వ్యవసాయ యోగ్యం కానీ భూ ములను, ఇప్పటికే లే అవుట్లుగా మారిన భూములను తహసిల్దార్, మున్సిపల్ కమి షనర్, వ్యవసాయ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించారు. కలెక్టర్ మాట్లా డుతూ అర్హులైన, నిజమైన రైతులకు రైతు భరోసా లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమ ని, ఆ దిశగా వ్యవసాయ యోగ్యం కానీ భూములను లేఅవుట్లు, ఇళ్ళు నిర్మించుకు న్న భూములు, భూసేకరణ చేసిన భూముల ను గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు.

రెవెన్యూ సర్వే నెంబర్ల ఆధా రంగా సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి ఇప్పటికే   వ్యవసాయానికి యోగ్యం కాని భూములను గుర్తింపు ప్రక్రియ ముమ్మరం చేయాలని  సూచించారు. తహసిల్దార్, వ్యవసాయా ధికారులు, మున్సిపల్ కమిషనర్  సమన్వ యం చేసుకుంటూ వ్యవసాయ యోగ్యం లేని భూములను  గుర్తించాలని సూచించా రు.

ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పూర్త యిన సర్వే ఆధారంగా జాబితా సూపర్ చెక్ చేసి నిజమైన అద్దె దారులు ఎవరు, నిజ మైన అర్హులు ఎవరు అనేది పక్కాగా గుర్తిం చాలన్నారు. ప్రత్యేక అధికారి జడ్పి డిప్యూటీ సిఈఓ రామమహేశ్వర్, తహసిల్దార్ వెంక టేష్, ఎంపీడీవో చెన్నమ్మ, మున్సిపల్ కమిషనర్, వ్యవసాయ అధికారులు, ఇతర సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.