calender_icon.png 23 October, 2024 | 7:46 PM

భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

23-10-2024 06:00:48 PM

నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి 

కలెక్టర్ ఆదర్శ్ సురభి..

వనపర్తి (విజయక్రాంతి): జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో భూసేకరణ అంశాలకు సంబంధించి రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గణపసముద్రం రిజర్వాయర్ బ్రాంచ్ కెనాల్ కు సంబంధించి 197 ఎకరాలు నవంబర్ 20 లోపు సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 27 ప్యాకేజీ కింద భూసేకరణ, అవార్డు జారీ ప్రక్రియ నవంబర్ చివరి నాటికి పూర్తి చేయాలన్నారు. గణపురం బ్రాంచ్ కెనాల్ లో కర్నె తండా పార్ట్ లో 171 ఎకరాలు సర్వే కూడా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ యం.నగేష్, భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ సి.హెచ్ వెంకటేశ్వర్లు, ఎస్. ఈ శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేషన్ ఈ.ఈ లు మధుసూదన్ రావు, పంచాయతీ రాజ్ ఈ.ఈ మల్లయ్య, ఆర్డివో పద్మావతి, ఏడి సర్వే బాలకృష్ణ, డి.ఈ లు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.