calender_icon.png 8 October, 2024 | 7:18 PM

భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి...

08-10-2024 05:09:11 PM

రెవెన్యూ అధికారులతో పాలమూరు రంగా రెడ్డి, కే.ఎల్. ఐ ఇతర రిజర్వాయర్ ప్రాజెక్టుల భూసేకరణ పై సమీక్ష.. కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి (విజయక్రాంతి) : నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో పాలమూరు రంగారెడ్డి, కే.ఎల్. ఐ ఇతర రిజర్వాయర్ ప్రాజెక్టుల భూసేకరణపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే పి.ఎన్.పి.డి స్టేజిలో ఉన్నవి గడువు ముగించే లోగా భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో తమ సిబ్బందితో సమీక్షిస్తూ, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటు భూసేకరణ పనులు వేగవంతం చేయాలని సూచించారు.

బొల్లారం, గోపాల్ దిన్నె, బుద్దారం, పెద్ద చెరువు భూసేకరతో పాటు బండరాయిపాకుల పునరావాస కేంద్రంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముంపు బాధితులకు  పునరావాస కేంద్ర సమస్యలు ఉంటే పరిష్కార మార్గాలు అన్వేషించి పరిష్కారం చేయాలని సూచించారు. అవార్డు స్టేజీలో ఉన్న వాటికి వెంటనే అవార్డు పాస్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక ఉప కలెక్టర్ భూసేకరణ ను ఆదేశించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్, భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ సి.హెచ్. వెంకటేశ్వర్లు, ఆర్డీఓ పద్మావతి, ఇరిగేషన్ ఎస్. ఈ శ్రీనివాస్ రెడ్డి, ఈ. ఈ మధుసూదన్ రెడ్డి, పంచాయతీ రాజ్ కార్యనిర్వహక ఇంజనీరు మల్లయ్య, డి. ఈ లు, సెక్షన్ సుపరిండెంట్ కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.