22-03-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, మార్చ్ 21 (విజయ క్రాంతి) : హమాలీలకు లైసెన్సు లు జారీ చేయుటకు వ్యవసాయ కమిటీలు, అధికారులు పేపర్ ప్రకటన ద్వారా దరఖాస్తులు స్వీకరించి ఎంపిక ప్రక్రియను మార్చి చివరి లోగా పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం వ్యవసాయ కమిటీలలో హామలీల కు కొత్తగా లైసెన్సులు ఇచ్చే అంశంపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హమాలిల సమస్యలు, లైసెన్స్ ల పై జిల్లా కలెక్టర్ కమిటి సభ్యులతో చర్చించారు. ఈ కమిటీలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఛైర్మెన్ గా, జిల్లా మార్కెటింగ్ అధికారి, జిల్లా సహకార అధికారి, మార్కుఫెడ్ జిల్లా మేనేజర్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్, పి.ఏ.ఈ.ఎస్ సీఈఓ గుడిహత్నూర్, సబ్ కలెక్టర్, ఆర్.డి.ఓ లు సభ్యులుగా ఉంటారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్ మార్కెట్ కమిటీ చైర్మన్, మార్కెటింగ్ , మార్క్ ఫెడ్, సహకార శాఖ, అధికారులు, తదితరులు ఉన్నారు.