calender_icon.png 31 October, 2024 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

06-07-2024 12:00:00 AM

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్

బక్క జడ్సన్ దీక్షకు మద్దతు

నాలుగో రోజు కొనసాగిన ఆమరణ నిరాహార దీక్ష 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5(విజయక్రాంతి): నిరుద్యోగులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, గ్రూప్ 2, 3 పరీక్షను వాయి దా వేసి పోస్టుల సంఖ్యను పెంచాలని ఏపీవీసీసీ మాజీ చైర్మన్ బక్క జడ్సన్ నాలుగు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష కు శుక్రవారం మోత్కుపల్లి మద్దతు తెలిపా రు. జడ్సన్ ఇంటికి వెళ్లి వెళ్లి పరామర్శించి, మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ.. తెలంగాణ యువత పదేళ్లుగా ఉద్యోగాల కోసం పోరాడుతున్నదన్నా రు. గత ప్రభుత్వంలో వారికి జరిగిన అన్యాయాన్ని బస్సు యాత్ర ద్వారా ఊరూరు తిరి గి ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చేలా చేశాననని చెప్పారు.  గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు 1:100 ప్రకారం ఎంపిక చేయాలని, గ్రూప్ 2, 3లో ఉద్యోగాలను పెంచాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు.