ఎస్పీ రోహిత్ రాజు...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): బాధితుల సమస్యలపై త్వరితగతన విచారణ చేసి పరిష్కరించాలని ఎస్పి రోహిత్ రాజ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తన దృష్టికి తెచ్చిన వివిధ రకాల సమస్యలను భాదితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భాధితుల సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణమే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేకూర్చాలని ఆదేశించారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విచారణలో జాప్యం జరగకుండా వీలైనంత త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేకూర్చాలని అధికారులకు ఆదేశించారు.