సిద్దిపేట (విజయక్రాంతి): దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ మను చౌదరికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జిల్లా కేంద్రంలో తప్పకుండా జరిపించాలని, ఆదే రోజు అర్హులైన వికలాంగులకు స్కూటీలు అందజేయాలని, సదరం సర్టిఫికెట్ పొందిన అర్హులైన దివ్యాంగ్యులందరికి పెన్షన్లు ఇవ్వాలని, ప్రభుత్వం పెంచిన పెన్షన్ రూ.6016 ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రంలో కులగనణతో పాటు వికలాంగుల యొక్క గణన కూడా చేయాలని, అర్హులైన దివ్యాంగ్యులందరికి ఇందిరమ్మ ఇండ్లు, అంత్యోదయ కార్డులు ఇవ్వాలని, దివ్యాంగులకు సంబంధించిన వ్యవసాయ భూమి 2018 ధరణిలో వేరే వారి పేరిట మాకు తెలియకుండా మారిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దివ్యాంగులకు న్యాయం జరిగేలా రెవెన్యూ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఎవరి భూమి వారికి రికార్డు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.