24-03-2025 05:50:40 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని వికలాంగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇస్లాంబిన్ హసన్ కలెక్టర్ వెంకటేష్ దోత్రేను కోరారు. సోమవారం కలెక్టరేట్ లో కలెక్టర్ కలిసి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇస్లాం బిన్ హసన్ మాట్లాడుతూ... ఆలింకో సంస్థ ద్వారా నిర్ధారణనైన వారికి వెంటనే సహాయక పరికరాలు అందజేయాలని కోరారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో సామాజిక పెన్షన్ బ్యాంక్ అకౌంట్ ద్వారా పంపించేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం నిర్వహించే తలపెట్టిన రాజవ్ యువ వికాసం పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. జిల్లా ఆర్పిడి-2016 చట్టం ప్రకారం కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి దివ్యంగుల కన్వర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు రాజయ్య, శ్రీనివాస్, మొండయ్య, తాజ్ పాల్గొన్నారు.