calender_icon.png 18 April, 2025 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

10-04-2025 04:51:30 PM

తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ అధ్యక్షులు బైరాగి మోహన్..

దౌల్తాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు సమస్యలతో సతమతమవుతున్నారని ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించి హామీలను అమలు చేయాలని తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు బైరాగి మోహన్ అన్నారు. గురువారం రాయపోల్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనం గోడ పత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు వార్తలు రాసి ఉద్యమాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులతో పాటు, ఉద్యమ వార్తలు రాసిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, ఫోటో, వీడియో, డెస్క్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో తెలిపిన విధంగా తెలంగాణ ఉద్యమకారులకు, జర్నలిస్టులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు. జర్నలిస్టుల భవిష్యత్ కార్యాచరణ ఈ సమ్మేళనంలో రూపొందించడం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 13వ తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల సమ్మేళనం కార్యక్రమానికి జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి, జర్నలిస్ట్ నాయకులు ఆనంద్ రావు, చంద్రకాంత్ రెడ్డి,ప్రవీణ్, రాయపోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్ట రాజు, జర్నలిస్టులు మహమ్మద్ గౌస్, మన్నే గణేష్, ఉషనగళ్ళ నర్సింలు, ఇంద్రకరణ్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.