13-12-2024 12:30:01 AM
నిర్మల్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లాలో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు చేపడుతున్న గురువారం మూడో రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా వారు జిల్లాకేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లా డుతూ.. ప్రభుత్వం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తాము విధులు నిర్వహిస్తున్నామని, అయినప్పటికీ వృత్తిలో ఎదుగుదల లేదన్నారు. మానవహారంతో ఆర్డీవో కార్యాలయ మార్గంలో అరగంట పాటు ట్రాఫిక్ నిలిచింది. పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. ధర్నాలో ఉద్యోగ సంఘం నాయకులు గంగాధర్, రాజారత్నం, ఫిరోజ్, గజేందర్, నవిత, జ్యోతి, నరేశ్, అపర్ణ, వీణ పాల్గొన్నారు.