calender_icon.png 9 February, 2025 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి అధికారుల సమస్యలను పరిష్కరించాలి..

08-02-2025 07:06:08 PM

మణుగూరు (విజయక్రాంతి): సింగరేణి అధికారుల సమస్యలను యాజమాన్యం సత్వరమే పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని కోల్ మైన్స్ ఆఫ్ ఇండియా సింగరేణి బ్రాంచ్ అధ్యక్షులు, మణుగూరు ఏరియా పీకేఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ లక్ష్మీపతి గౌడ్ కోరారు. సంస్థ సీఎండీ బలరాం పదవి కాలాన్ని మరో సంవత్సర కాలానికి పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం సందర్భంగా సీఎండీకి అధికారుల సంఘం తరఫున శనివారం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మణుగూరు ఏరియా జిఎం దుర్గం రామచందర్ కు సింగరేణి అధికారుల సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధికారులందరికీ వేతనంలో భాగమైన పెర్ఫార్మన్స్ రిలేటెడ్ పే(PRP)కు సంబంధించి 2022-23 సంవత్సరానికి గాను కోల్ ఇండియాలో జూన్ 24న PRP చెల్లించారన్నారు.

అయినప్పటికిని సింగరేణి సంస్థలో ఇప్పటివరకు పిఆర్పి చెల్లించకపోవడం పట్ల అధికారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా 2024 నవంబర్ మాసంలో అధికారుల సంఘంతో జరిగిన నిర్మాణాత్మక సమావేశంలో యాజమాన్యం దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తగు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి, లక్ష్యసాధనకు నిర్దేశకత్వం వహించే ముఖ్యమైన ఫంక్షనల్ డైరెక్టర్స్ విషయంలో కొనసాగుతున్న అనిచ్చితిని తొలగించేలా న్యాయమైన నిర్ణయం తీసుకొవాలని, సంస్థ పురోభివృద్ధికి యాజమాన్యం విధంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అధికారులు ఎస్ రమేష్, సింగు శ్రీనివాస్, లింగ బాబు, రాంబాబు, శ్యామసుందర్, శ్రీనివాసచారి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.