calender_icon.png 8 January, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

07-01-2025 12:52:26 AM

ఎస్సీ, ఎస్టీ, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్‌మనోహర్

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6 (విజయక్రాంతి): తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు శ్యామ్‌మనోహర్ ప్రభుత్వాన్ని కోరారు.  ముషీరాబాద్ అజమా బాద్ డివిజన్ ఎలక్ట్రిసిటీ కార్యాలయం వద్ద సంఘం జెండాను సోమవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ప్రభుత్వం వద్ద, కోర్టులో ఉన్న రెండు సమస్యలను ఇప్పటివరకు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పం దించిన చర్యలు తీసుకుంటే తమకు ప్రమోషన్లు, పోస్టింగులు వస్తాయని పేర్కొన్నారు. జెండా ఆవిష్కరణ అంటే అసోసియేషన్ అస్థిత్వానికి, సాంఘిక హోదాకు, సభ్యుల గౌరవార్థానికి నాంది పలకడమని చెప్పారు.