calender_icon.png 13 January, 2025 | 2:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

16-07-2024 12:15:00 AM

ఇంటర్ బోర్డు కార్యదర్శికి ప్రొ.కోదండరాం వినతి

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజాతో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై ఆయన వినతిపత్రాన్ని సమర్పించారు. హెల్త్ ఇన్స్యూరెన్స్, పెన్షన్ తదితర సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. దీనికంటే ముందు రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో రిటైర్డ్ ఉద్యోగులతో సమావేశమైన కోదండరామ్‌కు వారు తమ సమస్యలను వివరించారు.