10-03-2025 01:18:59 AM
రాష్ర్ట అధ్యక్షుడు గొట్టే నాగరాజు యాదవ్
హుజూర్‌నగర్, మార్చి 9: తెలంగాణ ప్రభుత్వం రాష్ర్టం లోని ప్రైవేట్ టీచర్ల సమస్య లను పరిష్కరించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షులు గొట్టే నాగరాజు డిమాండ్ అన్నారు. ఆదివారం హుజుర్ నగర్ టౌన్ హాల్లో జరిగిన ప్రెవేట్ టీచర్స్ సమావేశానికి ముఖ్య అధితిగా హాజరైన నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టంలో ప్రైవేట్ టీచర్లకు అన్ని రకాల ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాల న్నారు.
ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కోరుతూ గతంలో రాష్ర్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ర్టంలోని ప్రైవేట్ టీచర్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి సమస్యల పరిష్కారానికి మంత్రి ఉత్తమ్ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గొట్టే నాగమణి యాదవ్, జిల్లా అధ్యక్షులు మన్నెం నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు ప్రకాష్, జిల్లా నియోజకవర్గ అధ్యక్షులు శ్రీనివాసచారి, ప్రధాన కార్యదర్శి కృష్ణకుమారి, విజయ్ కుమార్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.