గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు వినతిపత్రం అందజేత
అబ్దుల్లాపూర్‌మెట్, జనవరి 31: గడ్డిఅన్నారం ఫ్రుట్ మార్కెట్‌లో పనిచేస్తున్న హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కారించాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి అన్నారు. శుక్రవారం బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి, వైస్‌చైర్మన్ సీహెచ్ భాస్కరచారిలను కలిసి వినతి పత్రం అందజేశారు.
అనంతరం గడ్డిఅన్నారం ఫ్రుట్ మార్కెట్‌లో హమాలీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చైర్మన్, వైస్ చైర్మన్, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శిలతో చర్చించారు. ఈ సందర్భంగా ముత్యాల యాదిరెడ్డి మాట్లాడుతూ... గడ్డిఅన్నారం ఫ్రుట్ మార్కెట్‌లో పనిచేస్తున్న హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కారించాలన్నారు. అదే విధంగా హమాలీ కార్మికుల సమస్యలు అన్ లోడింగ్, లోడింగ్ యూనిఫామ్, లైసెన్స్ తదితర అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు.
కార్మికుల సమస్యలను విన్న చైర్మన్, వైస్ చైర్మన్లు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు అజ్మీర హరి సింగ్ నాయక్, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు కేతరాజు నరసింహ, సైదులు, ఫుట్ మార్కెట్ యూనియన్ అధ్యక్షులు ఎండీ షరీఫ్, ప్రధాన కార్యదర్శి చిన్న గౌడ్ కోశాధికారి మేతరు పోచయ్య, రాములు , శంకర్ నాయక్, మున్న, కే కృష్ణ రాజా, ముస్తఫా చంద్రశేఖర్ అంజాద్ ఖాన్ తిప్పన్న తదితరులు పాల్గొన్నారు.