మెదక్, జూలై 11 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సమ స్యలను పరిష్కరించాలని కోరుతూ గురువా రం మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులు మాట్లాడుతూ.. పెన్షనర్లకు నగదు రహిత వైద్య చికిత్స అందించే ఈహెచ్‌ఎస్ పథకం సక్రమంగా అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి ఈహెచ్‌ఎ స్ పథకం అమలయ్యేలా చూడడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలి కోరారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ జగదీశ్‌చంద్ర, ప్రధాన కార్యదర్శి ఎస్ శ్యాంసుందర్, కోశాధికారి గోలి లక్ష్మణ్‌కుమార్, బీ మోహన్‌రా జ్, వీరయ్య, సుధాకర్ పాల్గొన్నారు.