calender_icon.png 19 April, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూనివర్సిటీల్లో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

18-04-2025 12:00:00 AM

పోలీసులు అరెస్టుచేసిన పార్ట్ టైం టీచర్లను బేషరతుగా విడుదల చేయాలి

ముషీరాబాద్, ఏప్రిల్ 17 (విజయశాంతి): రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన ’ఛలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆరట్స్ కళాశాల నుంచి బయలు దేరబోయిన పార్ట్ టైం అధ్యాపకులను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకుని ఛలో  సెక్రటేరియేట్ ఆందోళన సందర్భంగా పోలీసు లు అరెస్టు చేసిన వారిని చిక్కడపల్లి, ముషీరాబాద్ పోలీసుస్టేషన్లకు తరలించారు.

ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చిక్కడపల్లి పోలీసుస్టేషన్కు అరుణోదయ సాంస్క తిక సమాఖ్య చైర్పర్సన్, గాయని విమలక్క బృందం వచ్చి ఆందోళనకు మద్దతు ప్రకటించి సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ తెలంగాణలో పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్టైమ్ అధ్యాపకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

యూనివర్శి టీలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సర్వీసును క్రమబద్ధీకరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, నియామకాల్లో పార్ట్ టైం టీచర్ల అనుభవాన్ని బట్టి  వెయిటేజ్ ఇవ్వాలని, నియా మకాల్లో పార్ట్ టైం ప్రధా ప్రాధాన్యత ఇవ్వాలని, విధులను క్రమబద్ధీకరించడంతో పాటు ఉద్యోగభద్రత కల్పించాలని డిమాం డ్ చేశారు.

పార్ట్ టైం అధ్యాపకుల సాధక బాధకాలను తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్లే కార్యక్రమంలో తాను ముం దు నిలుస్తానని అన్నారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

దశాబ్దాలుగా యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకు ఉద్యో గ భద్రత కల్పించాలని కోరారు. నియామకాలలో పార్ట్ టైం టీచర్లకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పార్ట్ టైం అధ్యాపకుల అనుభవానికి వెయిటేజీ మార్కులు ఇవ్వాలని కోరారు.

సమాఖ్య ప్రధాన కార్యదర్శి పోతుల రమేశ్ తదితరులతో పాటు టిఎయుపిటి రాష్ట్ర నాయకులు బోనకుర్తి సోమేశ్వర్, జానకిరామ్ రెడ్డి, ఇరుగు శ్రావ్యా, అనిత కుమారి పాల్గొన్నారు. తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాల యాల అధ్యక్షులు, కార్యదర్శులు, అధ్యాపకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వందలాది మంది పార్ట్ టైం  అధ్యాపకులు పాల్గొన్నారు.