calender_icon.png 26 December, 2024 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ వర్క్ ఇన్స్పెక్టర్ల సమస్యలను పరిష్కరించాలి

26-10-2024 06:40:15 PM

జాయింట్ డైరెక్టర్ బోనగిరి శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేత

మేడిపల్లి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్ల జీతాలను పెంచి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ల రాష్ట్ర అధ్యక్షుడు దూసరి సతీష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాదులోని సిడిఎంఏ కార్యాలయంలో మున్సిపల్ ఔట్  సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ల బృందం జాయింట్ డైరెక్టర్ బోనగిరి శ్రీనివాసులును కలిసి వినతి పత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, డిప్లమా, ఐటిఐలు చేసి చాలీచాలని జీతాలతో పని చేస్తున్నామన్నారు. నగరంలో నిర్మాణాలు జరిగే భవనాలు, రోడ్లను నాణ్యత ప్రమాణాలను పాటించి పనులు జరిగేలా 24 గంటలు పని చేస్తున్నామన్నారు. మా ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యేలా, 40 వేల రూపాయల కనీస వేతనం చెల్లించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. అధిక ధరలతో చాలీ చాలని జీతాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామన్నారు. వెంటనే మా సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో కోశాధికారి సురేందర్ రెడ్డి,సిహెచ్ రాంప్రసాద్, వి అంజయ్య, ఆర్గనైజింగ్ఎండి ఖలీద్ హుస్సేన్, సిహెచ్ కిషోర్ తదితరులు ఉన్నారు.