calender_icon.png 19 April, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

17-04-2025 07:49:37 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గురువారం ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు రామగిరి మహేష్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మార్పీఎస్ మున్సిపాలిటీ అధ్యక్షులు రాచకొండ శ్రీనివాస్, మచ్చ రాజేష్ తో పాటు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.