13-03-2025 12:27:23 AM
రాష్ట్ర అధ్యక్షురాలు వై స్వప్న
ఇబ్రహీంపట్నం, మార్చి 12 (విజయక్రాంతి): మధ్యాహ్న భోజ నం పథకం కార్మికుల పెండింగ్ బిల్లు ల గురించి అసెంబ్లీలో చర్చకు తీసు కొచ్చి పరిష్కారం చేయాలని మధ్యా హ్న భోజన కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న డిమాండ్ చేశా రు. బుధవారం మధ్యాహ్న భోజన కార్మిక సంఘం అధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేశారు. కార్మికులకు బిల్లులు, వేతనాలు రాక, అనేక ఇబ్బందుల గురవుతున్నారని, ఆరు నెలల నుండి బిల్లులు వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. వెంటనే బిల్లులను చెల్లించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు నవనీత, స్వరూప, మంజుల,స్వరూప,మంగమ్మ, అనిత,రాధ, బాలమని,అనిత, అనసూయ తదితరులు పాల్గొన్నారు.