calender_icon.png 26 February, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా

25-02-2025 11:27:04 PM

మంత్రి కొండా సురేఖ హామీ..

హైదరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంస్థల్లో పని చేస్తున్న జర్నలిస్టుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. మంగళవారం హెచ్‌యుజే జర్నలిస్ట్ యూనియన్ నాయకులు సచివాలయంలో మంత్రి సురేఖను కలిసి తమ సమస్యలను వివరించారు. జర్నలిస్టుల కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూ హెల్త్ కార్డులు ఇవ్వాలని పేర్కొన్నారు. అలా కుదరదంటే ఏటా ప్రతి జర్నలిస్టు కుటుంబానికి రూ. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు రూ.10 లక్షల జీవిత బీమా ఇవ్వాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి సురేఖ.. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని తెలిపారు. సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్, కార్యదర్శి జగదీశ్వర్, నాయకులు లలిత, విజయ, నవీన్, రాజశేఖర్ తదితరులు ఉన్నారు.