calender_icon.png 26 November, 2024 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్రాష్ట్ర ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

26-11-2024 12:35:44 AM

టీ ఎన్జీవో, ఏపీ ఎన్జీవో నేతల విజ్ఞప్తి

హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): అంతర్రాష్ట్ర ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవో, ఏపీఎన్జీవో నేతలు కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని టీఎన్జీవో భవన్‌లో అంతర్రాష్ట్ర ఉద్యోగ బదిలీల సమావేశం నిర్వహించగా రెండు రాష్ట్రాల ఎన్జీవో నాయకులు హాజరై చర్చించారు. రాష్ట్ర విభజన తర్వాత స్థానికేతర ఉద్యోగులు ఇప్పటికీ తెలంగాణ, ఏపీలో విధులు నిర్వర్తిస్తూ రిజర్వేషన్లు కోల్పోతున్నారన్నారు.

తమ పిల్లలు స్థానికత కోల్పోతున్నారని, హెల్త్ కార్డులు పనిచేయడంలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించడంలేదని ఉద్యోగు లు వాపోయారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల సీఎంలను కలిసి సమ స్య పరిష్కారానికి కృషి చేస్తామని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్ ఉద్యోగులకు భరోసా ఇచ్చా రు.

ఈ సమావేశంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్ , ఏపీ ఎన్జీవో ప్రధాన కార్యదర్శి పురుషోత్తమ్‌నాయుడు, వైస్ ప్రెసిడెంట్ రమ ణ తదితరులు పాల్గొన్నారు.