calender_icon.png 23 February, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టభద్రుల సమస్యలు కాంగ్రెస్‌తోనే పరిష్కారం

21-02-2025 12:22:08 AM

 పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి

హుజురాబాద్, ఫిబ్రవరి20 (విజయక్రాంతి): పట్టభద్రుల సమస్యలు కాంగ్రెస్‌తోనే సాధ్యమ వుతుందని పరకాల ఎమ్మెల్యే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ రేవూరి  ప్రకాష్ రెడ్డి అన్నారు.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల్లో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు అధ్యక్షతన గురువారం మండల కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.  కరీంనగర్, అదిలాబాద్, నిజాంబాద్, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపుకు ప్రతి ఒక్కరు సాయిశక్తుల పనిచేయాలని సూచించారు. ప్రతి ఓటర్ ఇంటికి వెళ్లి ఓటును అభ్యర్థించాలని,

పట్టభద్రుల  సమస్యలను శాసనమండలిలో నరేందర్ రెడ్డి గళం విప్పుతారని తెలిపారు. ప్రచారం చేసే సమయంలో పట్టభద్రుల సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.