24-02-2025 12:00:00 AM
టీజిఈజేఏసి చైర్మన్ మారం జగదీశ్వర్
మంచిర్యాల, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి) : అటవీశాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కారిస్తానని టీజిఈజేఏసి చైర్మన్, టిఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు, అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షులు మారం జగదీశ్వర్ అన్నారు.
ఆదివారం జిల్లాకు వచ్చిన టీఎ న్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో టీఎన్జీవో ఫారెస్ట్ సెంట్రల్ ఫోరం అధ్యక్షులు పొన్న మల్లయ్య, జూనియర్ ఫారెస్ట్ అసోసియే షన్ కాళేశ్వరం జోనల్ సెక్రటరీ అత్తే సుభాష్, కవ్వాల్ సర్కిల్ రెప్రజెంటేటివ్ అజర్, అటవీశాఖ నాయకులు కలిసి గజమాలతో ఘనంగా సన్మానించారు. జగ దీశ్వర్ వివాహ వార్షికోత్సవ సందర్బంగా సిరిసిల్ల పద్మశాలి నేతలతో నేసిన అగ్గిపెట్టె లో పట్టే పట్టు వస్త్రాలు సమర్పించారు.
అనంతరం అటవీశాఖ కాళేశ్వరం జోనల్ సెక్రటరీ, కవ్వాల్ సర్కిల్ రెప్రజెంటేటివ్ జేఏసి చైర్మన్‌తో భేటీ అయ్యారు. అటవీ శాఖలో ఖాళీగా ఉన్న ఎఫ్‌బీఓ పోస్టులను భర్తీ చేయాలని, పోలీస్ శాఖలో వర్తిస్తున్న జీత భత్యాలు, అటవీ శాఖలోని యూనిఫాం స్టాఫ్‌కు కూడా వర్తింపచేయాలని, పదోన్న తులు కల్పించాలని కోరారు. అటవీ శాఖ లోని జూనియర్ ఫారెస్ట్ అధికారులు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా టీ జి ఈ జే ఏ సి చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ జూనియర్ ఫారెస్ట్ అధికారుల సమస్యలను సీ ఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టీఎన్జీవో మంచి ర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అసోసియేట్ అద్యక్షులు శ్రీపతి బాపు రావు తదితరులు పాల్గొన్నారు.