23-04-2025 04:47:03 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో కూలీలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ కేసముద్రం మండల కార్యదర్శి గొడిశాల వెంకన్న బుధవారం ఎంపీడీవో క్రాంతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ... గత కొన్నేళ్ల నుండి చాలీచాలని వేతనాలతో కుటుంబ భారాన్ని మోస్తున్నారని, ప్రస్తుతం పెరిగిన నిత్యవసర ధరల నేపథ్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం నెలకు రూ. 26 వేల రూపాయలు చెల్లించాలని కోరారు. అలాగే పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని, 10 లక్షల బీమా సౌకర్యం సౌకర్యం కల్పించాలని కోరారు.