ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం తీర్యాణి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడంతో పాటు సంక్షేమ బోర్డు సలహా బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం కట్టుతున్న సెస్ రెండు శాతానికి పెంచాలన్నారు. కార్మికులు ప్రమాదంలో చనిపోతే వారి కుటుంబానికి 10 లక్షల, సహజ మరణానికి 5 లక్షల రూపాయలను, పెళ్లి కానుకగా లక్షకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు భవన నిర్మాణ కార్మికులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు కిన్నక జంగు, ప్రవీణ్ కుమార్, మొగిలి, దేవేందర్, హరీష్, శంకర్, తిరుపతి, సత్తయ్య, వెంకటేశం తదితరులున్నారు.