మంత్రి పొన్నంకు టీఆర్టీఎఫ్ విజ్ఞప్తి
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, మినిమం టైమ్ స్కేలును అమలు చేయాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేశ్, ఎం అంజిరెడ్డి డిమాండ్‌చేశారు. సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిప త్రం అందజేసినట్టు వారు ఒక ప్రకటనలో తెలిపారు. పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపజేయా లని మంత్రిని కోరినట్టు చెప్పారు.