22-03-2025 01:44:50 AM
బూర్గంపాడు,మార్చి 21(విజయక్రాంతి): ఆశ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని సీఐటీయూ మండల కన్వీనర్ పాండవుల రామనాథం ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆశ వర్క ర్ల సమస్యల పరిష్కారానికి మొరంపల్లి బంజ ర వైద్యశాల ఎదుట ప్లే కార్డులతో నిరసన ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఆశా వర్కర్లను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ 26వేలు ఇవ్వాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వ ర్యంలో ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలన్నారు.
అనంతరం పిహెచ్సీ మెడికల్ ఆఫీసర్ కు సమస్యలతో కూడిన వినతి ప త్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు కో కన్వీనర్ గుంటక కృష్ణ,ఆశ వర్క ర్లు బుచ్చమ్మ, తారా దేవి, పి చిట్టెమ్మ, కళావతి,భారతి,నాగమణి,బాయమ్మ,కృష్ణవేణి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు