calender_icon.png 18 March, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలి

18-03-2025 12:17:28 AM

దౌల్తాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశా కార్యకర్తల సమస్యలపై చర్చించి పరిష్కరించాలని ఆశా కార్యకర్తల యూనియన్ మండల అధ్యక్షురాలు బాలమణి అన్నారు. సోమవారం దౌల్తాబాద్ మండల కేంద్రం తహసిల్దార్ కార్యాలయంలో సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం నిర్వహిస్తున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు రూ.18 వేల ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి. అర్హతలను బట్టి పదోన్నతి కల్పించాలని అలాగే పిఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శ్రమకు తగ్గ వేతనం కల్పించాలని పని ఒత్తిడి తగ్గించాలని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు షాహిన్, లక్ష్మీ, మంజుల, కౌసల్య, రజిత, పి.లక్ష్మి, రేణుక, భాగ్య, సౌజన్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.