కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యుత్ శాఖ ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట చేపడుతున్న రిలే నిరాహార దీక్ష మంగళవారానికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఆర్టిజన్ ఉద్యోగులు చేపడుతున్న దీక్షకు విద్యుత్ ఉద్యోగుల (1104) సంఘం నాయకులు మద్దతు తెలిపారు. సందర్భంగా ఆ సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ.. ఆర్టిజన్లకు విద్యారతను బట్టి కన్వర్షన్ ఇవ్వాలని, ఏపీ ఎస్ ఈ బి సర్వీస్ రూల్స్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకే సంస్థలో ఒకే రూల్స్ అమలు చేయకుండా ఆర్టిజన్ పేరిట కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ మారుతి, కన్వీనర్ నసీరుద్దీన్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు రమేష్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ డివిజన్ అధ్యక్షులు సురేందర్, రమేష్, సంఘం నాయకులు పాల్గొన్నారు.