calender_icon.png 4 March, 2025 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్తీలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి

04-03-2025 08:39:07 PM

గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ కు దొభి ఘాట్ బస్తివాసుల వినతి..

ముషీరాబాద్ (విజయక్రాంతి): తమ బస్తీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని దోభీ ఘాట్ బస్తి వాసులు మంగళవారం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. దోభిఘాట్ బస్తి వాసులు, బస్తీలో షాబాద్ బండల ఏర్పాటు, సేవరేజీ, మంచినీటి నూతన పైప్ లైన్లు ఏర్పాటు చేయాలని, అలాగే స్థానికుల అవసరం మేరకు బస్తీలో ఒక మంచినీటి నల్లా ఏర్పాటు చేయాలని వీటితో పాటు దొభీ ఘాట్ లో తమ బస్థివాసుల కొరకు కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇవ్వాలని కార్పొరేటర్ ను కోరారు.

సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ బస్తి వాసులతో మాట్లాడుతూ.. ప్రజల అవసరాల వినతి మేరకు ధోభీ ఘాట్ లో కావలసిన అభివృద్ధి పనులపై వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి త్వరలో పనులను ప్రారంభించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ధోబి ఘాట్ బస్తి వాసులకు, కార్పొరేటర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, శ్రీ శాంతి రజక సహకార సంఘం ప్రతి నిధులు నాగేష్,రమేష్, మల్లికార్జున్, సురేష్, నాగరాజ్, పలువురు బస్తి వాసులు పాల్గొన్నారు.