06-03-2025 12:00:00 AM
సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటే ల్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఆర్టిస్ట్’. రతన్ రిషి దర్శకత్వం లో జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సత్యం రాజేశ్, ప్రభాకర్, వినయ్ వర్మ, తనికెళ్ల భర ణి, భద్రమ్, తాగుబోతు రమేశ్, సుదర్శన్. పీ కిరీటీ, వెంకీ మంకీ, సోనియా ఆకుల, స్నేహ, మాధురి శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 21న రిలీజ్‌కు రెడీ అవుతోంది.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో సంతోష్ మాట్లాడుతూ.. “ఆర్టిస్ట్’లో సొసైటీలో ఉన్న ఒక ప్రాబ్లమ్‌ను దర్శకుడు చూపించాడు. ఆ సమస్య పాతదే అయినా కథ, కథనాలు కొత్తగా ఉంటాయి.” అని తెలిపాడు. హీరోయిన్ క్రిషేక మాట్లాడుతూ.. ‘హీరో సంతోష్‌తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. చాలా సపోర్టివ్ కో యాక్టర్.
టీమ్ అంతా చాలా కష్టపడ్డాం” అని తెలిపింది. డైరెక్టర్ రతన్ మాట్లాడుతూ..- ‘ఈ మూవీలో సస్పెన్స్, భయం, కామెడీ, రొమాన్స్ అన్నీ ఉంటాయి. ఒక ఎమోషన్ మీద కథ వెళ్తుంది. చివరి 20 నిమిషాలు హై ఉంటుంది’ అన్నారు. ప్రొడ్యూసర్ జేమ్స్ మాట్లాడుతూ..- ‘కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలనేది నా కోరిక. అందుకే మా సంస్థలో న్యూ కమర్స్‌తో మూవీస్ చేస్తున్నాం. ఇది మా సంస్థలో రెండో మూవీ’ అన్నారు.