కాంగ్రెస్ నేత వెలగపూడి ఫైర్
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ హయాంలో ఆ పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంతో పాటు తెలంగాణ సమాజాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెలగపూడి వీవీఎస్ చౌదరి అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టున కవితను బెయిల్‌పై బయటకు తీసుకొచ్చిన కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
అలాగే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన స్కామ్‌లపై ఎప్పుడు జైలుకి వెళ్లాల్సి వస్తుందోనని భయంతో కాలం వెల్లదీస్తున్నాడని విమర్శించారు. కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ పా ర్టీలో ఉన్నప్పటి నుంచే బీఆర్‌ఎస్‌కు కోవర్టుగా పనిచేశాడని.. బీఆర్‌ఎస్ పాలనను ప్రజలు తిరస్కరించినప్పటికీ వారిలో అహంకారం తగ్గడం లేదని వెలగపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని అన్నారు.