న్యూఢిల్లీ: నానాటికీ పెరిగిపోతున్న నిత్యావసరాలతో సామా న్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు. మరింత భారం పడనుంది. పాదరక్షలకు సంబంధించి ఆగస్టు 1 నుంచి కొత్త నాణ్యతా ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. అప్పటి నుంచి తయారు చేసే షూస్, బూట్లు, స్లిప్పర్లు, సాండిల్స్ ఈ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్(బీఐఎస్) స్పష్టం చేసింది. దీంతో వచ్చే నెల నుంచి పాదరక్షల ధరలుపెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే నాణ్యతా నియంత్రణ ఉత్తర్వుల ప్రకారం.. పాదరక్షల తయారీదారులు ఐఎస్ 6721, is 10702 నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉం టుంది. ఈ సవరించిన నాణ్యతా నిబంధల ప్రకారం.. చెప్పుల తయారీలో ఉపయోగించే రెగ్జిన్, ఇన్‌సోల్ వంటి ముడి పదార్థాలకు కచ్చితంగా రసాయన పరీక్షలు చేయించాలి.
పాదరక్షల బయటి భాగాలకు ఉపయోగించే మెటీరియల్ చిరగకుండా, ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందని చెప్పే నాణ్యతా పరీక్ష పాస్ అవ్వాలి. వినియోగదారులకు అసౌకర్యం కలిగించకుండా.. వారికి ఎక్కువకాలం మన్నికయ్యే ఉత్పత్తులను అందించేందుకు ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ప్రమాణాల కారణంగా ఉత్పత్తిదారులకు తయారీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
ఆ భారాన్ని తగ్గించుకునేందుకు ఉత్పత్తులపై ధరలు పెంచే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో వచ్చే నెల నుంచి చెప్పుల ధరలు పెరగొచ్చట..! అయితే, రూ.50కోట్ల కంటే తక్కువ వార్షిక టర్నోవర్ ఉండే తయారీదారులకు ఈ కొత్త నిబంధనల నుంచి మినహాయింపు కల్పించారు. అలాగే.. పాత సాక్‌కు ఈ రూల్స్ వర్తించబోవని అధికారులు స్పష్టం చేశారు. అయితే, విక్రయదారులు తమ వద్ద పాత స్టాక్ ఎంత ఉందో ఆ వివరాలను బీఐఎస్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.