calender_icon.png 15 March, 2025 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండెక్కిన చింతపండు ధర

15-03-2025 01:05:01 AM

  • పాలమూరులో క్వింటాల్‌కు రూ.15000 పలికిన చింతపండు

కాపు తక్కువగా కాయడమే ఇందుకు ప్రధాన కారణం

మహబూబ్ నగర్ మార్చి 13 (విజయ క్రాంతి) : చింతపండు ధర మార్కెట్లో కొండెక్కి పై పైకి పాకుతుంది. రోజురోజుకు చింతపండు ధరణి చూస్తే ఆశ్చర్యానికి గురిచేసే పరిస్థితి నెలకొన్నాయి. రైతు ఆశించిన ధర కంటే అధికంగా వచ్చినప్పటికీ చింతపండు దిగుమతి చాలా తక్కువగా ఉందని తెలుస్తుంది. కాపు తక్కువగా కాయ డంతో చింతపండు ధరలకు రెక్కల వచ్చాయి.

ఈనెల 11వ తేదీ నుండి మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ లో చింతపండు క్వింటాలకు రూ 15 వేల ధర పలుకుతుంది. జిల్లా నలుమూలల తో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా త నుండి మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కు రైతులు చింతపండును తీసుకువస్తున్నారు.

కాగా గురువారం చింతపండు క్వింటాలకు గరిష్టంగా రూ 11, 501 ధర పలికింది. రాబోవు రోజుల్లో చింతపండు ధర మరింత పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయ మార్కెట్ లో ఈ మేరకు ధర పలికితే బహిరంగ మార్కెట్లో వినియోగదారులకు మరింత అధికంగా చింతపండు లభించే అవకాశం ఉంది.