12-02-2025 01:28:26 AM
* రోజురోజుకూ పెరిగి పోతున్న పసిడి ధరలు
ముంబై: గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతా ల్లో ఒక తులం బంగారం ధరలు రూ.80, 600 (22 క్యారెట్స్), రూ.87,930 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి.
సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.800, రూ.8 70 పెరిగింది. చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 800, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్ రేటు రూ.870 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.80,600 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.87,930 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.
దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.800 పెరిగి రూ.80,750కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.1040 పెరిగి రూ.88,080 వద్దకు చేరింది. ఇదే విధంగా పెరిగితే త్వరలో బంగారం ధర తులానికి లక్షకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. బంగారం ధరలు పెరుగుతున్నా వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు రాలే దు. మంగళవారం వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి రేటు రూ.1,07,000 వద్ద ఉంది.