calender_icon.png 28 February, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తునికాకు కట్టకు రూ. 6 ధర ప్రకటించాలి

28-02-2025 12:57:49 AM

సీపీఐ ఎమ్మెల్సీ రాష్ట్ర నాయకులు అరెల్లి కృష్ణ 

మహబూబాబాద్. ఫిబ్రవరి 27: ప్రతి తునికాకు కట్టకు 6 రూపాయల ధరను ప్రకటించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు అరెల్లి కృష్ణ, అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొక్కల భాస్కర్ అన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో భారీ ప్రదర్శన చేసి తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు మండల కేంద్రంలోని ముఖ్య కార్యకర్తల సదస్సు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మెహబూబా జిల్లా కార్యదర్శి సోమయ్య అధ్యక్షతన జరగా .

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు అరెల్లి కృష్ణ అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొక్కల భాస్కర్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో రెండవ పంటగా పుణితాకు ఆదివాసీలకు జీవనాధారంగా ఉంటుందని ప్రతి ఫిబ్రవరి కంటే ముందే మొండెం కొట్టించే పనులు ప్రారంభించే వారిని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన సకాలంలో టెండర్లను పిలిచి తునికాకు సేకరణ చేయాలని డిమాండ్ చేశారు.

యాభై ఆకుల తునికాకు కట్టకు ఆరు రూపాయలు ధర నిర్ణయించాలని, అదేవిధంగా గతం కంటే ఉల్టా పల్టా కల్లేదార్ కమిషన్ తదితర విషయాలలో 30% అదనంగా ఇవ్వాలని, ఆకు సేకరణ క్రమంలో వడదెబ్బ వన్యమృగాల వేటలో ప్రాణాలు కోల్పోయిన తునికాకు కూలీలకు 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత పెండింగ్ బోనసులను తునికాకు కూలీలకు సత్వరమే వారికి అందించాలని, తద్వారా ఏజెన్సీ ఆదివాసి కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఏ ఐ కె ఎం ఎస్ రాష్ట్ర అధ్యక్షులు మొగిలి ప్రతాప్ రెడ్డి,రాష్ట్ర సహాయ కార్యదర్శి కోడి సోమయ్య, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా నాయకులు రణధీర్, సిద్ధబోయిన జీవన్, కేసముద్రం ఎస్ డి ఎస్ సి కార్యదర్శి కే భాస్కర్ రెడ్డి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి బానోత్ ఉక్లా, ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి పోలూరి శ్రీనివాస్, తొర్రూర్ ఎస్ డి ఎల్ సి కార్యదర్శి ఆలకుంట్ల సాయిలు, కొత్తగూడెం ఎస్ డి ఎల్ సి కార్యదర్శి కందగట్ల సురేందర్, ఏఐకే జిల్లా నాయకులు భూక్య శంకర్ గోగ్గెల రాంబాబు షేర్ మధు పడిగ సమ్మయ్య శ్రీను పిట్టల మల్లయ్య వీరమల్ల ఉమ అరుణ సుమలత భూక్య సోమేశ్ బలరాం అర్రం కోటమ్మ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.