calender_icon.png 30 April, 2025 | 11:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూల్యం చెల్లించుకోవాల్సిందే

24-04-2025 02:02:17 AM

  1. భారత్‌ను దెబ్బతీయాలని పాక్ కుట్రలు చేస్తోంది 
  2. దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు..
  3. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  4. ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉగ్రదాడి మృతులకు నివాళి
  5. సెక్రటేరియట్ నుంచి ట్యాంక్‌బండ్ పీపుల్‌ప్లాజా వరకు కొవ్వొత్తుల ర్యాలీ

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ప్రశాంతంగా ఉన్న జమ్మూక శ్మీర్‌లో పాకిస్థాన్ నిప్పులు పోస్తోందని, భారత్‌ను దెబ్బతీయాలని చూస్తే పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లించుకున్నట్లేనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హెచ్చరించారు.

బుధవారం ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొం డా విశ్వేశ్వర్‌రెడ్డి, డా.లక్ష్మణ్, బీజేపీ నేతలు చింతల రాంచంద్రారెడ్డి, ఏవీఎన్ రెడ్డి, తదితరులతో కలిసి కిషన్‌రెడ్డి పహల్గాం ఉగ్రదా డి మృతులకు నివాళులర్పించారు. పాకిస్థాన్ ముర్ధాబాద్ అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రదాడిని సభ్యసమాజం తీవ్రంగా ఖండిస్తోందని, ఇది సిగ్గుమాలిన చర్య అని ఖండించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా రాష్ర్టవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. 

భారత్‌ను అస్థిరపరచే కుట్ర: ఈటల 

భారత్‌ను అస్థిరపరచాలనే నీచమైన కుట్రలో భాగంగా ఈ దాడిచేశారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించా రు. ఉగ్రదాడిలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారత ప్రజల రక్తాన్ని కండ్లజూసిన వారి అంతమే కర్తవ్యం అని ప్రతినబూనుదామని సూచించారు. టెర్రరిస్ట్ దాడులు, తుపాకుల మోతలు లేకుండా దేశం ముందుకుపోతున్న తరుణంలో ఇలాంటి దుర్మార్గమైన చర్యకు తప్పకుండా మూల్యం చెల్లిస్తారన్నారు. 

బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో మృతిచెందిన వారికి బీజేపీ ఆధ్వర్యంలో నివాళులర్పించా రు. బుధవారం రాత్రి సెక్రటేరియట్ నుంచి ట్యాంక్‌బండ్ పీపుల్‌ప్లాజా వరకు బీజేపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎంపీ డీకే అరుణ, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మృతుల ఆత్మకు శాంతి కలగాలని 2నిమిషాలు మౌనం పాటించా రు. ఎంపీ డీకేఅరుణ మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి పిరికిపందల చర్య అని విమర్శించారు. దేశాభివృద్ధిని చూడలేక పాక్ భారత్‌ను దొంగదెబ్బ తీసిందని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.