calender_icon.png 19 April, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గత ప్రభుత్వం గాలికి వదిలింది

19-04-2025 01:15:58 AM

అభివృద్ధి చేయాల్సింది మీరే

శ్రీ రంగ నాయకులను అంగరంగ వైభవంగా మార్చాలి

రాష్ట్ర బీసీ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ విజ్ఞప్తి

పెబ్బేరు ఎప్రిల్ 18 : శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం గతపాలకులు మరిచారు, అభివృద్ధి చేయటం ఇప్పుడు ప్రభుత్వం పై ఉందని మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. కొత్త రెవెన్యూ మండలం గా ఏర్పాటు చేశారే తప్ప ఎటువంటి అభివృద్ధి కి నోచుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ రంగనాయక స్వామి ఆలయం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నడుంబిగించాలని అన్నారు. గ్రామం లో మార్నింగ్ వాక్ లో బాగంగా పోచమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ పరిపాలనా భవనాలు లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తో పాటు 30పడకల ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్, పబ్లిక్ టాయిలెట్ లను ఏర్పాటు చేయటానికి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి చొరవ చూపాలని కోరారు. రిజర్వాయర్ వెనకాల ఇండ్లు ప్రమాద స్థితికి చేరుకున్నాయి. వారికి ప్రభుత్వం నుంచి ప్రత్యామ్నాయం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మేంద్ర సాగర్, వివి గౌడ్, అస్కని రమేష్, పాండురంగ యాదవ్, రాఘవేందర్, మహేందర్, శివ, రవి, రాజేష్, బీసన్న, సుమన్, ప్రవీణ్ గౌడ్ పాల్గొన్నారు.